HNK: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ మొదటి, మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఈనెల 28న జరగాల్సిన పరీక్షలను బక్రీద్ పండుగ నేపథ్యంలో వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు జూన్ 3న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మిగతా పరీక్షల షెడ్యూల్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.