BDK: దమ్మపేట వ్యవసాయ సహకార సొసైటీ కార్యాలయంలో రైతులకు 50 శాతం సబ్సిడీపై జనుము, జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంగళవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని పంపిణీ చేశారు. పంట అవశేషాలను తగులబెడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. పచ్చిరొట్ట ఎరువులతో పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందన్నారు.