VZM: జియ్యమ్మవలస మండలంలోని ప్రధాన రహదారిపై నాలుగు రోజుల క్రితం వీచిన గాలులకు విరిగిపడిన చెట్ల కొమ్మలు ఇంకా తొలగించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టీకే జమ్ము, పీటీమండ, కొండచిలకాం, అలమండ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.