KDP: అట్లూరు మండలం యర్రబల్లిలో వారం రోజులుగా బోరు పని చేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలిపోయిన మోటార్‌ను ఇప్పటికీ మరమ్మతు చేయకపోవడంతో గ్రామస్తులు పొలాల నుంచి నీరు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. అధికారులు, నాయకులు వెంటనే స్పందించి ఎస్సీ కాలనీలో నీటి సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.