RR: కొత్తపేట డివిజన్లో తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. శివశంకర్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, శివగంగ కాలనీ, శ్రీనివాస కాలనీల్లో పర్యటించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. తక్కువ ఒత్తిడితో వస్తున్న నీటి సరఫరాను వెంటనే మెరుగుపరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.