మెదక్ జిల్లా చిలపల్లిలో ఐదు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి రూ.1.35 కోట్ల విలువైన 929.7 గ్రాముల బంగారం, 1.7 కిలోల వెండి రికవరీ చేశారు. విచారణలో నిందితుడు మూడు జిల్లాల్లో మొత్తం 17 దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడిని కోర్టు ముందు హజరుపరిచి రిమాండ్కు తరలించారు.