KDP: కువైట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బద్వేల్ పట్టణానికి చెందిన వెంకటసుబ్బయ్య (51) మృతి చెందారు. టీలోరీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆయనను రోడ్డుపై వెళ్తుండగా రమణయ్య కారు ఢీకొట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటసుబ్బయ్య మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.