NLR: ఆత్మకూరు పోలీస్ సిబ్బందికి యోగా మెడిటేషన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో మూడు రోజులపాటు యోగాకు శిక్షణ ఇస్తారు. హార్ట్ ఫుల్ నెస్, పతాంజలి యోగ, మానసిక ఒత్తిడి తగ్గించే విధానంపై అవగాహన కల్పించారు. యోగా ద్వారా పోలీసులకు మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం లభిస్తుందని సీఐ గంగాధర్ అన్నారు.