CTR: జ్యేష్ట మాసం మంగళవారం సందర్భంగా పుంగనూరు పురపాలక పరిధిలోని ఈస్ట్ పేట సమీపానగల శ్రీ చాముండేశ్వరి దేవి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతాలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.