GNTR: తెనాలి నందులపేట అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో వైద్యాధికారి డాక్టర్ నక్కా సుశాన్ గ్రేస్ వడదెబ్బ నివారణపై ప్రజలకు సూచనలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయట తిరగవద్దని, తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరినీరు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసేవలు పొందాలని తెలిపారు.