KMM: సింగరేణి ప్రాంతా నియోజకవర్గ శాసనసభ్యులతో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింగరేణి ప్రాంత అభివృద్ధి అంశంపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ మట్ట రాగమయి, రాందాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.