AP: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తులు రికార్డు స్థాయిలో దర్శించుకున్నారు. 10 రోజుల్లో 8,84,426 మంది భక్తులకు టీటీడీ అధికారులు దర్శనం కల్పించింది. శ్రీవారి సేవల సమయంలోనూ భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. పది రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.40.8 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.