IPL 2026 ప్లేఆఫ్స్ సమరానికి తెరలేచింది. నేడు జరగబోయే క్వాలిఫయర్-1 కీలక పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ RCB, GT తలపడనున్నాయి. కాగా, గాయం కారణంగా ఫిల్ సాల్ట్ దూరమైతే, RCB తుది జట్టులో వెంకటేష్ అయ్యర్‌కు అవకాశం దక్కనుంది. అయితే, మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేయగల సాల్ట్ ఆడేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ధర్మశాలలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.