ATP: ద్రోణి ప్రభావంతో నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షం వేళ పిడుగులు పడే ముప్పు ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని అధికారులు సూచించారు.