చిత్తూరు జిల్లాలో మళ్లీ ఎండలు పెరిగాయి. 10 మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. తవణంపల్లెలో 42.7 డిగ్రీలు, నగరిలో 42.3, విజయపురంలో 41.7, నిండ్రలో 40.9, గుడిపాలలో 40.8, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్లో 40.7, బంగారు పాళ్యంలో 40.6, గంగవరంలో 40.5, శ్రీరంగరాజపురంలో 40.4, కార్వేటినగరం, పలమనేరులో 39.9, పూతలపట్టులో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.