అన్నమయ్య: పుంగనూరు మండలం గూడూరుపల్లెకు చెందిన దేవసేన (28) కుటుంబ సమస్యల నేపథ్యంలో భర్త నవీన్‌తో సోమవారం గొడవపడింది. మనస్తాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది.