SRCL: పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండాలో చోటుచేసుకుంది. సోమవారం స్థానికుల కథనం ప్రకారం.. భారీ మెరుపులు, పిడుగులు పడడంతో కిషన్ నాయక్ అనే రైతు చెందిన ఎద్దు సోమవారం మృత్యువాత పడ్డట్లు తెలిపారు. ఎద్దులతో తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతు తెలిపారు.