అన్నమయ్య: బక్రీద్ సెలవు కారణంగా ఈనెల 28న జరగాల్సిన పదో తరగతి సప్లిమెంటరీ ఇంగ్లీష్ పరీక్షను జూన్ 5కు వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో పరీక్ష తేదీ మార్పు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.ఇతర పరీక్షలు యథావిధిగా కొనసాగనున్నాయని అధికారులు స్పష్టం చేశారు.