E.G: దేవరపల్లికి చెందిన రైతు కొండపల్లి దొరయ్య తాడిపూడి కాలువకు సంబంధించి సాగునీటి సరఫరాపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులకు సుమారు 20 ఎకరాలు ఉందని, 2004 – 2006 వరకు లిఫ్ట్ సమీపంలో ఉన్న అన్ని మోటార్లను నడుపుతూ రైతులకు సాగునీరు అందించేవారన్నారు. తరువాత మాత్రం ఒకే మోటర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారని వెల్లడించారు.