వరంగల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ డా. సత్య శారద ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 175 ఫిర్యాదులు నమోదయ్యాయి.వాటిలో 50 రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా, మున్సిపల్ సమస్యలపై 35, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం 32 అర్జీలు వచ్చాయి. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి. త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.