ASF: రెబ్బెన పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జాడి బాబురావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని సోమవారం ఆమె పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.