BHPL: మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామ సమీపంలోని L&T గెస్ట్ హౌస్లో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోంది. సోమవారం ఘటన స్థలాన్ని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.అగ్నిప్రమాదానికి గల కారణాలు,నష్ట వివరాలపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామని తెలిపారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.