వరంగల్ జిల్లాలో రబీ 2025-26 సీజన్ ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఇప్పటివరకు 78,786 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయగా, అందులో 75,723 మెట్రిక్ టన్నులు రైస్ మిల్లులకు తరలించినట్లు చెప్పారు. అలాగే 8,211 మంది రైతుల ఖాతాల్లో రూ.109 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.