PLD: నాదెండ్ల మండలం కనపర్రులో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రైతులు ముదవర్తి ఏసు, శ్రీకాంత్లకు చెందిన వరిగడ్డి, చొప్పజొన్న వాములు కాలిపోవడంతో రూ.3 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు కన్నీరుమున్నీరయ్యారు. నరసరావుపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.