PDPL: రామగుండం ప్రభుత్వ ఆసుపత్రిని మేయర్ మహంకాళి స్వామి సోమవారం సందర్శించారు. వడదెబ్బ బాధితులను పరామర్శించారు. ఆసుపత్రిలో ఫ్యాన్లు, కూలర్లు పనిచేయకపోవడం, వైద్యుల గైర్హాజరీపై రోగులు మేయర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన, బాధితులకు నిరంతరం వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాల కొరతపై పూర్తి నివేదిక ఇవ్వాలని సూచించారు.