KMR: మహిళా వారోత్సవాల సందర్భంగా జిల్లాలో 365 గ్రామ సంఘాల భవనాల భూమిపూజ, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సీఎం వర్చువల్గా ప్రారంభించారు. కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామ సంఘ భవనాలు, ధాన్యం గోదాముల నిర్మాణానికి రూ. 43.70 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు.