KNR: న్యాయవాది ఖాజా మొహినోద్దీన్ హత్య ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. హత్యకు కారణమైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని వారు కోరారు.