NZB: లారీలు, హమాలీల కొరత, ఎండ తీవ్రత వంటి అనేక ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ, వాటిని అధిగమిస్తూ రబీలో రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో జిల్లాలో దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. బాల్కొండ పరిధిలోని పలు ప్రాంతాల్లో మినహాయిస్తే, జిల్లాలో ధాన్యం సేకరణ పూర్తయ్యిందన్నారు.