VZM: భోగాపురానికి చెందిన ఉప్పాడ శివారెడ్డిని YCP రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో కార్యకలాపాల విస్తరణలో ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నియామకంపై నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.