కృష్ణ: పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో నిర్మించనున్న నూతన డిజిటల్ గ్రంథాలయ పనులను ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎం.ఎస్. బేగ్ పరిశీలించారు. CSR నిధులతో నిర్మించే గ్రంథాలయానికి సంబంధించిన ఏర్పాట్లు, తాత్కాలికంగా మార్చిన గ్రంథాలయాన్ని సందర్శించారు. పాత భవనాన్ని కూల్చివేస్తున్న పనులను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు.