»Former Indian President Pratibha Patils Husband Passes Away
Pratibha Patil: భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త కన్నుమూత
భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్(Pratibha Patil) ఇంట విషాదం నెలకొంది. ప్రతిభా పాటిల్(Pratibha Patil) భర్త దేవీసింగ్ హెకావత్(Devisingh Hekawat) కన్నుమూశారు.
భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్(Pratibha Patil) ఇంట విషాదం నెలకొంది. ప్రతిభా పాటిల్(Pratibha Patil) భర్త దేవీసింగ్ హెకావత్(Devisingh Hekawat) కన్నుమూశారు. దేవీసింగ్ షెకావత్ వయసు 89 సంవత్సరాలు. రెండు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబీకులు ఆయన్ని పూణెలోని కేఈఎం హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్య చికిత్స అందించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
ఈ రోజు సాయంత్రం పూణెలోని ఆయన నివాసంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. దేవీసింగ్ షెకావత్(Devisingh Hekawat) ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహించారు. ప్రతిభా పాటిల్ భర్త దెవీసింగ్ షెకావత్ అమరావతి(Amaravati) నియోజకవర్గం నుంచి 1985లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన గొప్ప విద్యావేత్తగా కూడా రాణించారు. 1972లో ముంబై యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ(PHD) పట్టా పుచ్చుకున్న దేవీసింగ్ షెకావత్(Devisingh Hekawat) అమరావతి తొలి మేయర్ గా కూడా పని చేసిన అనుభవం ఉంది. భారత దేశ తొలి మహిళా రాష్ట్రపతి భర్తగా కూడా ఆయన రికార్డుకెక్కారు. ఆయన మృతిపట్ల రాజకీయ నాయకులు సంతాపాన్ని తెలిపారు.