NLG: కట్టంగూర్ మండలం అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై నకిరేకల్ లోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్మాణ పనుల ప్రస్తుత స్థితి, నాణ్యత ప్రమాణాలు, నిధుల వినియోగం, పనుల వేగవంతంపై సమగ్రంగా చర్చించారు.