AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది. తారకరామసాగర్ వాకింగ్ ట్రాక్‌పై మంటలు ఎగసిపడుతున్నాయి. కొందరు చెత్తకు నిప్పుపెట్టగా, అది వాకింగ్ ట్రాక్‌కు వ్యాపించింది. ఆ మంటలు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలకు కూడా వ్యాపించి తగలబడుతున్నాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో పరిసరప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.