హాలీవుడ్ సెన్సేషన్ ‘అబ్సెషన్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం రూ.7.15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.750 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ మూవీ 10వేల% లాభాలను తెచ్చిపెట్టి రికార్డు సృష్టించింది. మనుషుల కోరికలను నిజం చేసే ఒక అతీంద్రియ వస్తువు వల్ల ఒకరి జీవితంలో ఎలాంటి భయానక పరిణామాలు ఎదురయ్యాయనే కథాంశంతో ఇది తెరకెక్కింది.