వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమిళ హీరో కార్తీ.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇవాళ అతని బర్త్ డే సందర్భంగా నిర్మాత నాగవంశీ.. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన చేశాడు. ఈ మేరకు కార్తీకి విషెస్ చెబుతూ ఫొటోలు షేర్ చేశాడు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది.