MNCL: జన్నారం మండలం కలమడుగు సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో లో-వోల్టేజీ సమస్య వెంటనే పరిష్కరించాలని మండల AE లచ్చన్నకు కలమడుగు గ్రామస్థులు వినతి పత్రం అందించారు. లో-వోల్టేజీ సమస్య వల్ల ఫ్రిడ్జ్, కూలర్లు, ఫ్యాన్లు కాలిపోతున్నాయన్నారు. విద్యుత్ బోరు పంపులు సక్రమంగా పనిచేయడం లేదన్నారు. సమస్యను పరిష్కరించాలని గ్రామ రైతులు కోరారు.