IPL 2026 సీజన్లోనూ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు నిరాశే ఎదురైంది. అతడు ప్రాతినిధ్యం వహించిన DC ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. 2013లో RCBతో ప్రయాణం మొదలుపెట్టి..SRH, PBKS, LSG, DC వంటి ఐదు వేర్వేరు జట్లకు ఆడినా, 14 ఏళ్లుగా రాహుల్‌కు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. దీంతో రాహుల్ ఉన్న టీమ్‌కు IPL కప్పు రాదేమో అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.