PPM: జిల్లా కేంద్రంలో వన్ స్టాప్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డి ప్రారంభించారు. మహిళలపై గృహహింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు వంటి సమస్యలకు గురైన బాధితులకు వైద్య, పోలీసు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్, తాత్కాలిక ఆశ్రయం సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు 181, చిన్నారులు 1098 హెల్ప్‌లైన్ నెంబరకు సంప్రదించాలన్నారు.