హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘దీవానా’ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా చిత్రబృందం విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ‘వన్ సైడ్ లవ్ శాస్తున్నా.. మస్తుంటది..’ అనే క్రేజీ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా, యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది.