నందమూరి బాలకృష్ణతో దర్శకుడు గోపీచంద్ మలినేని ‘NBK 111’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ నిర్మిస్తున్నారట. ఇక్కడ బాలయ్య, ఇతర ప్రధాన నటీనటులపై ఒక కీలకమైన, భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారట. ఈ సీన్లో బాలకృష్ణ గెటప్, సెటప్ అత్యంత థ్రిల్లింగ్ గా ఉండబోతున్నట్లు సమాచారం.