రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ పనులను వేగవంతం చేశారు. తాజాగా రామ్ చరణ్ తన డబ్బింగ్ పనులను పూర్తి చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రధాన పనులన్నీ ఇప్పటికే పూర్తి కావడంతో, రేపే యూఎస్ఏ ప్రింట్లను పంపనున్నట్లు సమాచారం. దీంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.