»Heart Stroke Hyderabad Constable Collapsed While Doing Gym
Heart Stroke: 24 ఏళ్లకే గుండెపోటు.. జిమ్ లో కుప్పకూలిన కానిస్టేబుల్
చదువు పూర్తయిన వెంటనే విశాల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం కలచివేస్తోంది. పాతికేళ్లు కూడా నిండని విశాల్ చనిపోవడం అతడి స్నేహితులను విషాదంలో ముంచింది. తమతో ఎప్పుడూ కలిసి సరదాగా ఉండే విశాల్ ఇలా ఆకస్మిక మరణం చెందడం తట్టుకోలేకపోతున్నారు.
ఆరోగ్యం.. శరీరంపై శ్రద్ధ పెట్టి వ్యాయామం (Workouts) చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. వర్కౌట్లు చేస్తుండగానే కిందపడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా పలువురు ప్రముఖులు మొదలుకుని సాధారణ ప్రజలు కూడా మృతి చెందుతున్నారు. అయితే వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి హఠాన్మరణాలు (Suddenly Deaths) సంభవించడం కలకలం రేపుతున్నాయి. తాజాగా పాతికేళ్లు కూడా నిండని ఓ కానిస్టేబుల్ (Constable) జిమ్ (Gym)లో కసరత్తులు చేస్తుండగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం హైదరాబాద్ (Hyderabad)లో విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ (Asif Nagar Police Station)లో విశాల్ (24) (Vishal) కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. 2020లో ఉద్యోగం సాధించాడు. సన్నగా ఉండీ శరీరాకృతిపై ప్రత్యేక శద్ర్ధ కనబరుస్తున్నాడు. ప్రతి రోజు వ్యాయామం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ (Secunderabad) బోయనపల్లి (Bowenpally)లో నిత్యం జిమ్ కు వెళ్తున్నాడు. యథావిధిగా గురువారం సాయంత్రం జిమ్ కు వెళ్లాడు. కసరత్తులు చేస్తుండగా విశాల్ కూలిపోయాడు. అకస్మాత్తుగా కిందపడిపోవడంతో అక్కడ ఉన్నవాళ్లు పరిశీలించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విశాల్ కన్నుమూశాడు. ఈ సంఘటనతో కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. చేతికి వచ్చిన కుమారుడు అంతలోనే మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. చదువు పూర్తయిన వెంటనే విశాల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం కలచివేస్తోంది. పాతికేళ్లు కూడా నిండని విశాల్ చనిపోవడం అతడి స్నేహితులను విషాదంలో ముంచింది. తమతో ఎప్పుడూ కలిసి సరదాగా ఉండే విశాల్ ఇలా ఆకస్మిక మరణం చెందడం తట్టుకోలేకపోతున్నారు.
కాగా గురువారం కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. వివాహ వేడుకలో పాల్గొన్న యువకుడు పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోయాడు. కాలా పత్తార్ (Kalapattar) పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహ కార్యక్రమానికి రబ్బానీ (Rabbani) అనే వ్యక్తి హాజరయ్యాడు. పెళ్లి కొడుకుతో సరదాగా మాట్లాడుతున్న సమయంలోనే కిందపడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. వరుసగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుండడం అందరినీ కలచి వేస్తోంది. నడి వయస్కులతోపాటు 30 ఏళ్లలోపు వారు కూడా ఆకస్మిక మరణాలు సంభవించడంపై వైద్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. వారి మృతికి కారణాలు ఏమిటనేవి పరిశీలిస్తున్నారు.
గతేడాది అక్టోబర్ 29వ తేదీన కన్నడ సూపర్ స్టార్ (Kannada Super Star) పునీత్ రాజ్ కుమార్ (46) (Puneeth Raj Kumar) ఈ విధంగానే హఠాన్మరణం చెందారు. తన ఇంట్లోనే జిమ్ లో కసరత్తులు చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. నాటి నుంచి ఇలాంటి సంఘటనలు దేశంలో చాలా చోట్ల చోటుచేసుకుంటున్నాయి.