తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య థియేటర్ల చెల్లింపుల వివాదం ముదిరింది. తాజాగా ఈ పంచాయితీ మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆయనతో ఎగ్జిబిటర్ల అసోసియేషన్ భేటీ కానున్నట్లు టాక్. మెగాస్టార్ సమక్షంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదోనని ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.