BDK: మణుగూరు మండలం చిక్కుడు గుంట గ్రామంలో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. చిక్కుడు గుంట గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళుతూ ఉండగా కల్వర్టును ఢీ కొట్టి తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.