HYD: నగర మౌలిక వసతుల అభివృద్ధిపై HMDA దృష్టి సారించింది. PVNR వంతెనపై ప్రమాదాల నివారణకు AI ఆధారిత కెమెరాల ఏర్పాటు ప్రతిపాదించగా, ట్యాంక్ బండ్ ఫుట్‌పాత్ మరమ్మతులు, హెరిటేజ్ కాంప్లెక్స్‌లో లిఫ్ట్‌ల ఏర్పాటు, హుస్సేన్ సాగర్ బతుకమ్మ కుంట అభివృద్ధి పనులు చేపట్టనుంది. అలాగే బుద్వేల్ ఇంటర్ ఛేంజ్ నిర్మాణానికి కన్సల్టెన్సీల నియామక ప్రక్రియ కొనసాగుతోంది.