HYD: చారిత్రక వారసత్వ కట్టడాల సంరక్షణలో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. నిజామియా ఆయుర్వేద ఆస్పత్రి, సిటీ కాలేజీ, మహబూబియా బాలికల పాఠశాల, స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, ఉస్మానియా యూనివర్సిటీ వంటి హెరిటేజ్ నిర్మాణాలు నగర ఘన చరిత్రను గుర్తు చేస్తున్నాయి. ఇక పురానా పూల్ బ్రిడ్జి వంటి కట్టడాలు HYD వైభవానికి ప్రతీక.