గద్వాల ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన BHN టెన్నిస్ క్రికెట్ లీగ్ ఫైనల్కు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్ హాజరయ్యారు. విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. తొలి బహుమతి RK టీంకు రూ.లక్ష, రెండో బహుమతి రఘు టీంకు రూ.50 వేలు ఇచ్చారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని నాయకులు సూచించారు.