ఖమ్మం రూరల్ మండలంలో ఇటుక బట్టీలు పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాల్లో బట్టీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని, వీటిని నివారించాల్సిన మండల అధికారులు వారికేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ బట్టీల నుంచి వచ్చే పొగతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.