దేశవ్యాప్తంగా జరగనున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-UG) షెడ్యూల్లో మార్పు చోటుచేసుకుంది. మే 28న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు NTA ప్రకటించింది. కేంద్రం బక్రీద్ పండుగకు సంబంధించిన ప్రభుత్వ సెలవు తేదీని సవరించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తామని NTA తెలిపింది.