WG: ఆకివీడులోని ఐ.భీమవరం రహదారిలో ఆదివారం రాత్రి బహిరంగంగా మద్యం సేవిస్తున్న పలువురు యువకులకు పోలీసులు గంజాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సీఐ కాళీచరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కిట్ల ద్వారా యువకుల నుంచి నమూనాలను సేకరించారు. సీఐ మాట్లాడుతూ.. గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.